: వీహెచ్ అడుగుజాడల్లో రాహుల్... వృద్ధ నేత ఉత్సాహంతో ఉప్పొంగిన యువనేత


పార్టీ ఎంపీల సస్పెన్షన్ పై వరుసగా మూడో రోజూ కాంగ్రెస్ పార్టీ నిరసనలతో కదం తొక్కింది. కొద్దిసేపటి క్రితం పార్లమెంటు ఆవరణలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ నేతలతో కలిసి నిరసన కొనసాగించారు. పార్లమెంటు హౌస్ నుంచి గాంధీ విగ్రహం వద్దకు వెళుతున్న క్రమంలో ప్లకార్డు పట్టిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, తెలంగాణకు చెందిన వృద్ధ నేత వి.హన్మంతరావు ఉత్సాహం చూసి రాహుల్ గాంధీ ఉప్పొంగిపోయారు. వీహెచ్ వెంట వడివడిగా నడుస్తూనే వీహెచ్ ఉత్సాహాన్ని రాహుల్ పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాక గాంధీ విగ్రహం దాకా వీహెచ్ ను అనుసరిస్తూనే రాహుల్ గాంధీ సాగారు.

  • Loading...

More Telugu News