: రిమోట్ గా కూడా పనిచేసే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది
స్మార్ట్ ఫోన్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పలు కంపెనీలు రకరకాల స్మార్ట్ ఫోన్లతో మార్కెట్టును ముంచెత్తుతున్నాయి. తాజాగా కార్బన్ నుంచి 'టైటానియం మాక్ ఫైవ్' పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఇది ఫోన్ రూపంలోనే కాకుండా రిమోట్ గానూ పనిచేయడమే దాని ప్రత్యేకత. ఫోన్ లో ఇన్ ఫ్రా రెడ్ ఎమిటర్, పీల్ అప్లికేషన్ ఉండటంవల్ల మార్కెట్ లోకి కొత్తగా వస్తున్న టీవీ, సెట్ టాప్ బాక్స్, ఏసీలకు ఈ ఫోన్ ను రిమోట్ గా ఉపయోగించుకోవచ్చని కార్బన్ సంస్థ తెలిపింది. దాదాపు 400 బ్రాండ్లకు ఇది రిమోట్ కంట్రోల్ గా పని చేస్తుందని వెల్లడించింది. ఇన్ని సౌకర్యాలున్న ఫోన్ ధర రూ.5,999 మాత్రమే.