: ఆమె పేరు గీత కాదు, పూజ... మా అమ్మాయే!: పాక్ 'బజరంగీ భాయిజాన్' కథకు కొత్త ట్విస్ట్


దాదాపు పుష్కర కాలం క్రితం దారితప్పి పాకిస్థాన్ లోకి వెళ్లి ఆశ్రయం పొందుతున్న అమ్మాయి గీత, తమ కుమార్తేనని అమృతసర్ కు చెందిన మూగ, బధిర జంట రాజేష్ కుమార్, రామ్ దులారీ అంటున్నారు. ఇప్పుడు గీతగా పిలవబడుతున్న అమ్మాయికి తాము పూజ అని పేరు పెట్టుకున్నామని, తాము పూజను ప్రేమగా గుడ్డీ అని పిలుచుకుంటామని చెబుతున్నారు. తమ పాప అమృతసర్ రైల్వే స్టేషనులో తప్పి పోయిందని అంటున్నారు. వీరి కుమారుడు రాజు మీడియాతో మాట్లాడుతూ, తాము బీహార్ నుంచి అమృతసర్ వచ్చామని, యాచకులుగా ఉంటూ, చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే వాళ్లమని చెప్పాడు. తమ కుమార్తెను తిరిగి తమ వద్దకు చేర్చాలని కోరుతూ, ఆమె చిన్నప్పటి చిత్రాన్ని ఆ తల్లిదండ్రులు చూపుతున్నారు.

  • Loading...

More Telugu News