: కొంత కాలం ఆగైనా, అందరం ఒకేసారి వెళ్లిపోదాం: ఏపీ సర్కారు


కొంత కాలం ఆగి, మౌలిక వసతులను చూసుకున్న తరువాతే హైదరాబాదులోని అన్ని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలనూ విజయవాడ సమీపానికి తరలించాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అనంతరం వెల్లడించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా తరలింపును పూర్తి చేయాలన్నదే తమ ఉద్దేశమని, మరోసారి అన్ని శాఖల అధిపతులతో సమావేశం జరిపి అంతిమ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తీసుకుంటామని ఆయన అన్నారు. తాత్కాలిక రాజధానిలో పనిచేసేందుకు వెళ్లాలంటే కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరించాల్సి వుందని ఆయన అన్నారు. పిల్లల స్థానికత, ఇంటి అద్దెలు వంటివి ఉద్యోగులను పీడిస్తున్నాయని కృష్ణారావు అన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News