: సబ్సిడీ ఉల్లికి పోటెత్తిన స్పందన... టీ రైతు బజార్ల ముందు జనం బారులు
కోయకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఒకేసారి కిలో ధర రూ.20 నుంచి రూ.50కి పెరిగితే అంతే మరి. అందుకేనేమో, తెలంగాణలోని మార్కెట్ యార్డుల్లో సబ్సిడీ ఉల్లి విక్రయ కేంద్రాలకు జనం పోటెత్తారు. ఉల్లి ధరల నుంచి జనానికి ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపట్టిన ఏపీ సర్కారు బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా నడుస్తోంది. దీంతో నిన్న రాష్ట్రవ్యాప్తంగా ‘రూ.20కే కిలో ఉల్లి’ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం ఈ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. దీంతో ఎక్కడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం మరింత మేర సరుకును దిగుమతి చేసుకునేందుకు చర్యలు చేపట్టింది.