: ఫార్చ్యూనర్ల స్థానంలో ల్యాండ్ క్రూయిజర్లు... కేసీఆర్ కాన్వాయ్ లో ఖరీదైన కార్లు
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాన్వాయ్ లో వాహనాలు మారిపోయాయి. ఇప్పటిదాకా టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్లనే వాడుతూ వస్తున్న కేసీఆర్, తన పంథా మార్చారు. వీటి స్థానంలో అత్యంత ఖరీదైన వాహనాలుగా పేరుపడ్డ ల్యాండ్ క్రూయిజర్లను కేసీఆర్ ఎంచుకున్నారు. ఒక్కోటి రూ.1.30 కోట్ల విలువ కలిగిన ఐదు ల్యాండ్ క్రూయిజర్ వాహనాలు ఆయన కాన్వాయ్ లో చేరిపోయాయి. తద్వారా అత్యంత ఖరీదైన వాహన శ్రేణి కలిగిన సీఎంల జాబితాలో కేసీఆర్ చేరిపోయారు. ఈ వాహనాలను బుల్లెట్ ప్రూఫ్ కూడా చేయించారట. ఇక ఇప్పటిదాకా వాడిన ఫార్చ్యూనర్లు మొదట్లో నలుపు రంగులో ఉండేవి. తర్వాత వాటిని తెలుపు రంగులోకి మార్చారు. తాజాగా కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూయిజర్లు కూడా తెలుపు రంగులోనే కేసీఆర్ కాన్వాయ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. యాదగిరిగుట్టలో కొత్త ల్యాండ్ క్రూయిజర్లకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం నిన్న ఈ కొత్త క్రూయిజర్లు సీఎం కాన్వాయ్ లో చేరాయి.