: అప్ డేటెడ్ వెర్షన్ 'మినీ కంట్రీమ్యాన్'ను భారత మార్కెట్లో లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ


వరల్డ్ క్లాస్ కార్ల తయారీదారు బీఎండబ్ల్యూ 'మినీ కంట్రీమ్యాన్' పేరుతో ఓ అప్ డేటెడ్ వెర్షన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.36.5 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం). ఈ లగ్జరీ కారులో భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగులు, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (డీటీసీ), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, రన్-ఫ్లాట్ ఇండికేటర్ పొందుపరిచారు. ప్రీవియస్ వెర్షన్ ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ లో మార్పులు చేయడం ద్వారా మినీ కంట్రీమ్యాన్ కు కొత్త లుక్ తీసుకువచ్చారు. దేశంలో ఉన్న మినీ డీలర్ల వద్ద మినీ కంట్రీమ్యాన్ ను బుధవారం నుంచి బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. బీఎండబ్ల్యూ మినీ మోడల్ ను 2012లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రీమియం సెగ్మెంట్లో చిన్న కారుగా రంగప్రవేశం చేసిన మినీ శ్రేణిలో మినీ 3 డోర్, మినీ 5 డోర్, మినీ కన్వెర్టిబుల్, మినీ కంట్రీమ్యాన్ ఉన్నాయి.

  • Loading...

More Telugu News