: 18 ఏళ్లకే 144 ఏళ్ల వార్ధక్యం!... ఫిలిప్పీన్స్ అమ్మాయి దురదృష్టం
ఫిలిప్పీన్స్ అమ్మాయి అనా రోచెల్లీ పాండారే ఓ దురదృష్టవంతురాలు. అత్యంత అరుదైన వ్యాధి ప్రొజేరియా ఈ అమ్మాయిపై విరుచుకుపడింది. దాంతో, 18 ఏళ్లకే 144 ఏళ్ల పండు ముదుసలిని తలపించే రూపం రోచెల్లీ పరమైంది. ఆమెను చూసినవారెవ్వరూ టీనేజ్ బాలిక అనుకోరు. సరిగా ఎదగని శరీరం, ముడతలుదేరిన చర్మంతో వార్ధక్యంలో ఉన్న మహిళగానే పొరబడతారు. అదంతా వ్యాధి ఫలితమే! రోచెల్లీకి ఐదేళ్లప్పుడు ఆమె ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఆరుగురు తోబుట్టువులు ఉన్న ఈ అమ్మాయి వ్యాధి నేపథ్యంలో స్థైర్యం మాత్రం కోల్పోలేదు. చక్కగా డ్రెస్ చేసుకుని ఉత్సాహంగా ఉండేందుకు ప్రాధాన్యమిస్తుంది. తమ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ షాపులో పనిచేస్తూ కస్టమర్లతో చలాకీగా వ్యవహరిస్తుంది. బాడీ బిజార్రే అనే టీవీ సిరీస్ లోనూ కనిపించడం విశేషం. తన శరీరంపై పలు పరిశోధనలకు అంగీకరించడం ద్వారా ప్రొజేరియా వ్యాధి తీవ్రతను తగ్గించే ఔషధాల ఆవిష్కరణకు తోడ్పాటునందిస్తోంది.