: నిన్ను మళ్లీ పెళ్లి చేసుకునేందుకు నేను రెడీ!: భర్తకు జెనీలియా తాజా ప్రపోజల్


'నిన్ను మళ్లీ పెళ్లి చేసుకునేందుకు రెడీ' అంటూ తన భర్త రితేష్ దేశ్ ముఖ్ కు 'టాలీవుడ్' హాసిని జెనీలియా సరదాగా ప్రపోజ్ చేసింది. తన 28వ పుట్టిన రోజు సందర్భంగా జెనీలియాకు ఆమె భర్త ఫ్యామిలీ ఫోటో బహుమతిగా అందజేశాడు. ఈ బహుమతికి మురిసిపోయిన జెనీలియా తన భర్తపై ఉన్న ప్రేమను ట్విట్టర్లో ఆ రకంగా వ్యక్తం చేసింది. కాగా, జెనీలియా పుట్టినరోజును పురస్కరించుకుని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు అభినందనలు తెలిపారు. అభిషేక్ బచ్చన్, ఫరాఖాన్, రానా, సానియా మీర్జా, బిపాసా బసు వంటి వారు ట్వీట్లతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ మధ్యే జెనీలియా వంట నేర్చుకోవడం ప్రారంభించిన సంగతి కూడా తెలిసిందే. భోజన ప్రియురాలైన ఫరా ఖాన్ ను జెనీలియా ఇంటికి ఆహ్వానించింది.

  • Loading...

More Telugu News