: ఏపీ అభివృద్ధికి కొన్ని చర్యలు చేపట్టాం: అరుణ్ జైట్లీ
విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని ఎంపీలు తన దృష్టికి తెచ్చారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో తెలిపారు. ఏపీ లోటు బడ్జెట్ ను పూడ్చడానికి, రాజధాని నిర్మాణానికి, పరిశ్రమల స్థాపనకు కేంద్రం సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. విభజన వల్ల ఏపీ ఆర్థికంగా ఇబ్బంది పడుతోందన్నారు. అభివృద్ధికి ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టామని, మొదటి ఏడాది వీలైనంత సాయం అందించామని చెప్పారు. అభివృద్ధి అంశంలో ఏపీ తమకు ప్రధానమైందని జైట్లీ స్పష్టం చేశారు. అయితే ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని, ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలపై నీతి అయోగ్ ముఖ్యమంత్రుల సబ్ కమిటీ చర్చిస్తోందని జైట్లీ పేర్కొన్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదాపై జైట్లీ మాట్లాడకుండానే సమాధానాన్ని దాటవేశారు.