: టీచర్ల ప్రేమ పాఠాలు... విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన


కర్నూలు జిల్లా దేవనకొండలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్థానిక జెడ్పీ హైస్కూల్ లో కొందరు టీచర్లు ప్రేమ పాఠాలు బోధిస్తున్నారని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో, తల్లిదండ్రులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు. లవ్ బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదరు టీచర్లను సాగనంపాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న డీఈవో అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ టీచర్ల నిర్వాకంపై విచారణ చేపడతామని స్పష్టం చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించారు.

  • Loading...

More Telugu News