: సునీత మరణం వెనుకా ర్యాగింగ్ నేపథ్యం!


ఈ మధ్యాహ్నం గుంటూరు జిల్లా మలినేని ఇంజనీరింగ్ కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సునీత మరణం వెనుకా ర్యాగింగ్ భూతమే ఉంది. అయితే, సునీతను ఎవరూ ర్యాగింగ్ చేయలేదు. కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్ వ్యవహారాలను ఎలాగైనా ఆపించాలన్న ఉద్దేశంతో, దాన్ని వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ సునీతను పిలిచి తీవ్రంగా మందలించడంతో, మనస్తాపానికి గురైన ఆమె కళాశాల ఐదవ అంతస్తు నుంచి కిందకు దూకినట్టు తెలుస్తోంది. కళాశాలకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News