: ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సర్ఫర్


'సాహసం సేయరా ఢింబకా' అని 'పాతాళభైరవి'లో మాంత్రికుడు చెప్పిన మాట అతనికి తెలియకపోయినా, దానిని ఆచరిస్తున్నాడు ఆస్ట్రేలియా సాహసికుడు రోబీ మాడిసన్ (34). సముద్రపు అలలతో పోటీ పడడం అత్యంత ప్రమాదకరం అని అందరికీ తెలిసిందే. అలాంటి ప్రమాదాలకు ఎదురెళ్లే క్రీడ సర్ఫింగ్. ఏళ్ల శిక్షణ ఉంటే కానీ సర్ఫింగ్ చేయడం సాధ్యం కాదు. ఎంత నైపుణ్యమున్న సర్ఫర్ నైనా సముద్రపు అలలు బోల్తా కొట్టిస్తుంటాయి. అంత ప్రమాదరకరమైన సర్ఫింగ్ ను బైక్ పై చేసి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తాడు రోబీ మాడిసన్. హాలీవుడ్ సినిమాల్లో సాహసాలు చేసే రోబీ మాడిసన్ ఆస్ట్రేలియాలోని ఓ సముద్రతీరంలో ఈ సాహసం చేశాడు. పైప్ డ్రీమ్ పేరిట విడుదల చేసిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇలా సర్ఫింగ్ చేయడానికి రెండేళ్ల కఠోర సాధన చేశానని రోబీ మాడిసన్ తెలిపాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న మీదట ఈ సాహసం చేశానని చెప్పాడు. ఈ ఫీట్ కోసం 250 ఎస్ఎక్స్ డర్ట్ బైక్ వినియోగించానని మాడిసన్ చెప్పాడు. ప్రమాదం జరుగకుండా హెల్మెట్ ధరించానని, ఆ హెల్మెట్ కూడా సర్ఫ్ నురగతో ప్రత్యేకంగా తయారు చేసినదని మాడిసన్ చెప్పాడు. అలాగే బైక్ పై బరువు పడకుండా ఉండేందుకు లైఫ్ జాకెట్ వినియోగించానని మాడిసన్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ కు చెందిన రోబీ మాడిసన్ జేమ్స్ బాండ్ హీరో డేనియల్ క్రేగ్ నటించిన స్కై ఫాల్ లో నటించాడు.

  • Loading...

More Telugu News