: నెహ్రూ వికీపీడియా పేజ్ ఎడిట్ చేయడంపై దర్యాప్తు ప్రారంభమైంది: కేంద్రం


మాజీ ప్రధాని, దివంగత జవహర్ లాల్ నెహ్రూ వికీపీడియా పేజ్ లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో ఎడిట్ చేసిన ఘటనలో దర్యాప్తు మొదలైందని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, "వికీపీడియా పేజీని అసలెక్కడి నుంచి సవరించారో తెలుసుకునేందుకు చర్యలు ప్రారంభించాం" అని లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. వికీపీడియా వెబ్ సైట్ లో ప్రచురించిన సమాచారం ప్రకారం, 'వికీమీడియా ఫౌండేషన్' సపోర్ట్ చేస్తున్న బహుభాషా, వెబ్ ఆధారిత, ఫ్రీ కంటెంట్ ఎన్ సైక్లోపీడియా ప్రాజెక్ట్ అని వివరించారు. దాన్ని ఎలాగైనా సవరించుకోవచ్చని అన్నారు. అయితే ఇంటర్నెట్ ఉన్న ఎవరైనా వికీపీడియా వెబ్ సైట్ లో ఉన్న ఆర్టికల్స్ ను సవరించవచ్చన్నారు. పరిమిత సందర్భాలలో మాత్రమే అంతరాయం లేదా విధ్వంసాన్ని అరికట్టేందుకు సవరణను నియంత్రిస్తారని మంత్రి రవిశంకర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News