: మహిళల రక్షణ గాలికొదిలి విలాసాలకు టర్కీకా...?: బాబుపై రోజా ఫైర్


ఎన్నికలకు ముందు మహిళల రక్షణకు ఎన్నో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటన్నింటినీ గాలికొదిలేశారని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. గోదావరి పుష్కరాల సమయంలో 27 మంది, నాగార్జున వర్శిటీలో రుషితేశ్వరి మరణానికి కారకులైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోని బాబు విలాసాల కోసం టర్కీ పర్యటనకు వెళ్లాడని నిప్పులు చెరిగారు. అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచుతామని, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని, తమ సమస్యల పరిష్కారానికి నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీలపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ఇదేనా మహిళల రక్షణ? అని రోజా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News