: సల్మాన్ ఖాన్ హర్ట్ అయ్యాడట!


ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి చెల్లెలు అర్పితా ఖాన్ అంటే చెప్పలేనంత ఇష్టమని అందరికీ తెలిసిందే. చెల్లి వివాహం తరువాత ఆమె బర్త్ డే రావడం ... అదే సమయంలో తన తాజా చిత్రం 'భజరంగీ భాయ్ జాన్' సూపర్ హిట్టవడం... ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఇంట్లో వేడుకను ఘనంగా నిర్వహించాలని భావించాడు. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలకు పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ గానాబజానా హోరుతో తెల్లవారు జాము వరకు జరిగింది. వారింట్లో పెట్టిన డీజే సౌండ్ కి నిద్రాభంగమైన స్థానికులు ముంబై పోలీసులను ఆశ్రయించారు. తక్షణం సౌండ్ ఆపించాలని డిమాండ్ చేశారు. దీంతో తెల్లవారు జాము 2:30 నిమిషాలకు పాలీహిల్స్ లో ఉన్న అర్పితా ఖాన్ ఇంటికి వెళ్లిన పోలీసులు పార్టీ ముగించాలని చెప్పారు. పెద్ద శబ్దంతో చుట్టుపక్కలవారికి ఇబ్బంది కలిగించినందుకు గాను 12 వేల రూపాయలు జరిమానా కట్టించుకుని వెళ్లిపోయారు. అలా పుట్టినరోజు పార్టీ మధ్యలోనే ఆగిపోవడంతో అప్సెట్ అయిన సల్లూభాయ్ తరువాత రోజు ఆదివారమైనా షూటింగ్ కి వెళ్లిపోయాడట.

  • Loading...

More Telugu News