: ప్రపంచ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లో టాప్ పొజిషన్ కోల్పోయిన యాపిల్


ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా ఉన్న చైనాలో యాపిల్ ఆధిపత్యానికి గండి పడింది. చైనాలోని రెండు అతిపెద్ద సెల్ ఫోన్ తయారీ సంస్థలు జియోమీ, హువావేలు తమ అమ్మకాలను గణనీయంగా పెంచుకోవడంతో యాపిల్ మూడవ స్థానానికి పడిపోయింది. దీంతో చైనా మార్కెట్లో యాపిల్ ఆధిపత్యం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. ఏప్రిల్ - జూన్ మధ్యకాలంలో జియోమీ 15.9 శాతం మార్కెట్ వాటాను సాధించి తొలి స్థానంలో నిలువగా, 15.7 శాతంతో హువావే రెండో స్థానంలో, 11.1 శాతంతో యాపిల్ మూడవ స్థానంలో నిలిచాయి. శాంసంగ్, వివోలు వరుసగా 8.7 శాతం, 7.9 శాతం వాటాతో టాప్-5లో ఉన్నాయి. ఐఫోన్ 6, 6 ప్లస్ ఫోన్ల ఆవిష్కరణతో 2014 చివరి త్రైమాసికంలో చైనా మార్కెట్లో తిరుగులేదన్నట్టున్న యాపిల్ ఆపై ఒక్కసారిగా దిగజారింది. యాపిల్ తాజా ఐఫోన్లు 10 నెలల పాతవిగా మారడం, ఆపై తక్కువ ధరల్లో పలు రకాల కొత్త మోడల్స్ అందుబాటులోకి రావడం, జియోమీ విడుదల చేసిన ఎంఐ నోట్ ఫాబ్లెట్, రెడ్ మీ2 ఘన విజయం సాధించడం యాపిల్ పై స్మార్ట్ ఫోన్ కస్టమర్ల మక్కువను తగ్గించాయని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News