: పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ప్రాణాలతో ఎలా పట్టుబడ్డాడంటే...!


పాకిస్థాన్ కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది ఉస్మాన్ ను భారత బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి. 20వ పడిలో ఉన్న ఉస్మాన్ పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ కు చెందిన వాడు. కసబ్ తర్వాత భారత బలగాలకు ప్రాణాలతో పట్టుబడ్డ తొలి ఉగ్రవాది ఉస్మానే. ఉస్మాన్ పట్టుబడటం కూడా చాలా కాకతాళీయంగా జరిగింది. బీఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపిన తర్వాత పక్కనున్న గ్రామంలోకి వెళ్లి, ముగ్గురు స్థానికులను బందీలుగా చేసుకుని పక్కనున్న అడవిలోకి పారిపోయాడు ఉస్మాన్. వీరిని బీఎస్ఎఫ్ బలగాలు అనుసరిస్తూ వెళ్లాయి. అడవిలో ఒక కొండపైకి వెళ్లిన ఉస్మాన్ కింద వస్తున్న బలగాలపై కాల్పులు ప్రారంభించే సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తాను బందీలుగా తీసుకొచ్చిన ముగ్గురు గ్రామస్తులు ఒక్కసారిగా ఉస్మాన్ చేతిలోని గన్ ను లాగేసుకున్నారు. ఆ తర్వాత తనను వెళ్లనివ్వాలని ఉస్మాన్ వేడుకున్నా గ్రామస్థులు అతన్ని వదల్లేదు. ఆ తర్వాత కొండపైకి చేరుకున్న బలగాలు ఉస్మాన్ ను ప్రాణాలతోనే కస్టడీలోకి తీసుకున్నాయి. ఈ విషయాన్ని ఉస్మాన్ చెరబట్టిన ముగ్గురు గ్రామస్తుల్లోని ఒక వ్యక్తి వెల్లడించాడు.

  • Loading...

More Telugu News