: పోర్న్ సైట్లపై నిషేధం... వాళ్లకు కాసుల పంట పండిస్తోంది


పోర్న్ సైట్లపై కేంద్రం విధించిన నిషేధం, పోర్న్ డీవీడీ మార్కెట్ కు డిమాండ్ తెచ్చిపెట్టింది. అంతర్జాలంలో పోర్న్ సైట్లు ఆగస్టు 1 నుంచి పని చేయడం లేదు. దీంతో అశ్లీల వెబ్ సైట్లను ఆదరించే వారంతా డీవీడీ మార్కెట్ల వెంట పడుతున్నారు. దీంతో ఢిల్లీలోని లజపత్ నగర్, పాలిక బజార్, పహర్ గంజ్ మార్కెట్లకు వినియోగదారులు క్యూకట్టారు. దీంతో సాధారణంగా పది రూపాయలు పలికే డీవీడీ ధర అమాంతం పెరిగిపోయింది. కేవలం 10-12 క్లిప్స్ ఉండే 8 జీబీ డీవీడీ 300 రూపాయలు పలికింది. కోల్ కతాలోని ప్రఖ్యాత పార్క్ సర్కస్ మార్కెట్లో 20 రూపాయలు పలికిన డీవీడీలు ఇప్పుడు 40 రూపాయలు పలుకుతున్నాయి. టెక్కీలు అధికంగా ఉండే బెంగళూరులో పోర్న్ డీవీడీల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో అయితే వీటి ధరలు 50 శాతం పెరిగాయట. అక్కడ ఓ వ్యాపారి మాట్లాడుతూ, '1995 నుంచి మార్కెట్లో ఉన్నాము. కానీ ఇంత డిమాండ్ ఎప్పుడూ చూడలేద'ని పేర్కొన్నారు. అలాగే పోర్న్ అభిమాని ఒకరు మాట్లాడుతూ, మొబైల్ ఫోన్లో సైట్లు ఓపెన్ అవుతున్నాయి కానీ ఒక ఎంఎంఎస్ డౌన్లోడ్ చేసుకునే సరికి జేబుగుల్లైందని ఆవేదన వ్యక్తం చేశాడు. కేంద్రం నిర్ణయం తమ జేబులు నింపుతోందని రోడ్డుమీడ డీవీడీలు అమ్ముకునే వ్యాపారి హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి కేంద్రం నిర్ణయం దేశీయంగా ఉన్న చిరు వ్యాపారుల జేబులు నింపుతోంది.

  • Loading...

More Telugu News