: గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని సునీత అనుమానాస్పద మృతి!


ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనను మరువక ముందే మరో దారుణం జరిగింది. గుంటూరులోని మలినేని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న సునీత అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. కాలేజీ భవనంపై నుంచి పడిన సునీత తీవ్రగాయాలపాలు కాగా, ఆసుపత్రికి తరలిస్తుంటే ప్రాణాలు విడిచింది. సునీత ప్రకాశం జిల్లా చందలూరు గ్రామానికి చెందిన విద్యార్థిని. కాగా, ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందా? లేక భవనంపై నుంచి పడిపోవడానికి వేరేమైనా కారణాలున్నాయా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News