: 'పార్ట్ టైమ్ క్రిమినల్' ప్రతిపక్ష నేతగా ఉన్నాడు... ప్రజల దురదృష్టం: మంత్రి కామినేని


ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వైసీపీ అధినేత జగన్ పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో క్రిమినల్ ప్రతిపక్షం నడుస్తోందని, ఓ పార్ట్ టైమ్ క్రిమినల్ ప్రతిపక్ష నేతగా ఉన్నాడని, అది ప్రజల దురదృష్టమని అన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో హెల్త్ క్యాంప్ ను సందర్శించిన కామినేని మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి విషజ్వరాలు లేవని, జగన్ అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మాజేరులో అనారోగ్య ఘటనలను జగన్ భూతద్దంలో చూపిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను భయాందోళనలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వైద్య సహాయం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News