: గాంధీ రాష్ట్రపతి, ప్రణబ్ సీఎం... మధ్యప్రదేశ్ లో పడిపోతున్న విద్యా ప్రమాణాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఎంత దారుణంగా ఉన్నాయో అక్కడి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తే అర్థమవుతుంది. కనీసం రాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియని దుస్థితిలో అక్కడి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులున్నారు. కొందరు విద్యార్థులు మహాత్మా గాంధీని రాష్ట్రపతిగా భావిస్తుండగా, మరికొందరు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణబ్ ముఖర్జీ అనుకుంటున్నారు. రాష్ట్రంలో మెరుగైన అక్షరాస్యత సాధించిన తొలి జిల్లాగా పేరుపొందిన నర్సింగ్ పూర్ జిల్లాలోనే ఇలా ఉంటే మిగతా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర విద్యా వ్యవస్థ పతనానికి ఇవి సూచనలని విద్యావేత్తలు సర్కారును హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మేలుకుని విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలని వారు కోరుతున్నారు.