: తెరకెక్కనున్న సానియా మీర్జా జీవితం
హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఈ బయోపిక్ కు ఫరా ఖాన్ దర్శకురాలు. సానియా, ఫరాఖాన్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. సానియా ఆత్మకథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా డిసెంబరు నుంచి షూటింగ్ జరుపుకోనుంది. కాగా, సానియా పాత్రలో బబ్లీ గాళ్ పరిణీతి చోప్రా నటించే అవకాశాలు ఉన్నాయి. సానియా కూడా పరిణీతి పేరే చెబుతోంది. సానియా ఆత్మకథ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ పుస్తకం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.