: మధ్యప్రదేశ్ రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ మాజీ మంత్రి స్పందన
మధ్యప్రదేశ్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ మాజీ మంత్రి దినేశ్ త్రివేదీ స్పందించారు. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని, మనుషులు చేసిన ప్రమాదమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కేవలం శతాబ్ది, రాజధాని వంటి ధనిక రైళ్ల మీదే శ్రద్ద పెడుతోందని, మిగిలిన రైళ్లను కూడా పట్టించుకోవాలని ఆయన సూచించారు. కాగా రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 37కు చేరింది.