: ఆగస్టు 15న దాడులు చేసేందుకు ఢిల్లీలో మకాం వేసిన 9 మంది ఉగ్రవాదులు!


పంద్రాగస్టు వేడుకలను భగ్నం చేసేందుకు 9 మంది ఉగ్రవాదులు ఢిల్లీలో మకాం వేశారని నిఘా వర్గాలకు సమాచారం అందడంతో దేశ రాజధానిలో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులు ఆర్డీఎక్స్, డిటొనేటర్లు సహా భారీ ఎత్తున పేలుడు పదార్థాలను తీసుకొచ్చినట్టు నిఘా వర్గాలు వెల్లడించినట్టు 'మెయిల్ టుడే' నేడు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ హెచ్చరికలను సీరియస్ గా తీసుకున్న కేంద్రం అన్ని సెక్యూరిటీ ఏజన్సీలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. వీరంతా మూడు నెలలకు ముందే ఢిల్లీకి చేరారని, వీరివద్ద అధునాతన ఆయుధాలు ఉండవచ్చని నిఘా వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News