: ముగ్గురిని బందీలుగా పెట్టుకున్న తీవ్రవాదులు... దాడికి జంకుతున్న సైన్యం
ఈ ఉదయం బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి ఇద్దరు జవాన్లను చంపి పారిపోయిన ఉగ్రవాదులు ముగ్గురు పౌరులను కిడ్నాప్ చేసి, బందీలుగా పట్టుకుని సమీపంలోని అడవులకు వెళ్లారు. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమైన సంగతి తెలిసిందే. మిగతా వారిపై దాడులు చేసేందుకు సైన్యం వెనకడుగు వేస్తోంది. వారి వద్ద బందీలుగా అమాయక ప్రజలుండటమే ఇందుకు కారణం. కాగా, కేంద్ర హోం శాఖ బందీలను విడిపించి వారిని మట్టుబెట్టాలని జమ్మూకాశ్మీర్ పోలీసులకు సూచించినట్టు తెలిపింది. ఆ రాష్ట్ర బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ డీకే పాథక్ తో మాట్లాడిన హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.