: మ్యాగీ సురక్షితమన్న రిపోర్టుతో నెస్లే హైజంప్!
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతించిన ల్యాబ్ లో మ్యాగీ నూడుల్స్ సురక్షితమేనని వచ్చిన నివేదిక, స్టాక్ మార్కెట్లో ఆ సంస్థపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచింది. దీంతో నేటి సెషన్లో నెస్లే సంస్థ ఈక్విటీ విలువ ఏకంగా 10 శాతం పెరిగింది. ఈ నివేదిక నెస్లే ఇండియాకు శుభవార్తని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. తిరిగి మ్యాగీ మార్కెట్లోకి విడుదలైతే, ఆ వెంటనే నెస్లే ఈక్విటీ పూర్వపు స్థితికి వెళ్లేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని అంచనా వేశారు. కాగా, ఈ సెషన్లో నెస్లే ఈక్విటీ ఉదయం 11:45 గంటల సమయంలో, క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 395 పెరిగి రూ 6,748 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 204 పాయింట్లు పెరిగి 28,276 వద్ద కొనసాగుతోంది.