: సీటు బెల్టు పెట్టుకోలేదని వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ పై చేయి చేసుకున్న ఎస్ఐ


కారు సీటు బెల్టు పెట్టుకోలేదన్న కారణంతో వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ పై ఓ ఎస్ఐ దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. నల్లచెరువు గ్రామ సర్పంచ్ రవికుమార్ రెడ్డి గత రాత్రి పొలం నుంచి ఇన్నోవా కారులో వస్తుండగా ఎస్ఐ నరేంద్రభూపతి ఆపారు. ఆ సమయంలో సీటు బెల్టు పెట్టుకోకుండా కనిపించిన సర్పంచ్ ను బెల్టు పెట్టుకోవాలని సూచించి, ఎందుకు పెట్టుకోలేదని అభ్యంతరకరంగా తిట్టాడు. ఇదేమిటని అడిగిన సర్పంచ్ పై ఎస్ఐ ఆవేశంగా చేయి చేసుకున్నాడు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రవికుమార్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News