: పది నిమిషాలకు ముందు ఆ ట్రాక్ పై రైళ్లన్నీ సజావుగానే వెళ్లాయి: రైల్వే అధికారి వ్యాఖ్య


మధ్యప్రదేశ్ లోని హర్దా వద్ద నిన్న జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ప్రమాదం జరగడానికి 10 నిమిషాల ముందు దాకా ఆ ట్రాక్ పై రైళ్లు సజావుగానే వెళ్లాయని రైల్వే సేఫ్టీ బోర్డు మెంబర్ ఒకరు చెప్పారు. హర్దాకు 25 కిలో మీటర్ల దూరంలోని మాచక్ నదికి అత్యంత సమీపంలో ఉన్న కల్వర్టు వద్దే ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. వరద తాకిడికి కల్వర్లు కింద ఉన్న మట్టి కొట్టుకుపోగా, అటుగా వచ్చిన కామయాని ప్రమాదానికి గురైందని, అదే సమయంలో ఎదురుగా జనతా ఎక్స్ ప్రెస్ రావడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News