: మంచి స్నేహితుడే ‘ఐ లవ్ యూ’ చెప్పాడు... డైరీలో విస్మయం వ్యక్తం చేసిన రిషితేశ్వరి
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరికి ఆమె స్నేహ బృందంలోని ఓ విద్యార్థి ‘ఐలవ్ యూ’ చెప్పాడట. ఈ మేరకు మంచి స్నేహితుడని భావించిన ఫ్రెండ్ నుంచే ఈ ప్రేమ ప్రతిపాదన రావడంతో విస్మయానికి గురైనట్లు రిషితేశ్వరి తన డైరీలో రాసుకుంది. బీఆర్క్ చదువు కోసం వరంగల్ నుంచి గుంటూరు వచ్చిన రిషితేశ్వరికి అప్పటికే ఐదుగురు విద్యార్థులతో కూడిన మిత్ర బృందం ఏర్పడింది. ఈ బృందంలో అభిషేక్ అనే విద్యార్థిని మంచి స్నేహితుడిగా భావిస్తే, అతడే తనకు లవ్ ప్రపోజ్ చేశాడన్న విషయాన్ని రిషితేశ్వరి తన తండ్రికి కూడా చెప్పింది. ఈ విషయాన్ని రిషితేశ్వరి తండ్రి ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ చెప్పారు.