: ఏపీది ద్వంద్వ వైఖరి... గవర్నర్ కు కేసీఆర్ ఫిర్యాదు, 3 గంటల పాటు సుదీర్ఘ భేటీ


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. హైదరాబాదులోని రాజ్ భవన్ లో దాదాపు 3 గంటలకుపైగా సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కేసీఆర్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ద్వంద్వ వైఖరితో ముందుకు వెళుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే పట్టిసీమ ప్రాజెక్టును చేపడుతోందని ఆరోపించారు. అదే సమయంలో అన్ని అనుమతులు ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సర్కారు వ్యతిరేకిస్తోందని ఆయన గవర్నర్ కు చెప్పారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి తరలింపు అంశాన్ని కూడా ప్రస్తావించిన కేసీఆర్, శిథిల భవనంలో ఆసుపత్రిని కొనసాగించలేమని తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News