: 30కి చేరిన మృతుల సంఖ్య... హర్దా, భోపాల్, ఇటార్సీ లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు


మధ్యప్రదేశ్ లోని హర్దా సమీపంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 30కి చేరింది. రైల్వే ట్రాక్ ను వరద నీరు ముంచెత్తిన నేపథ్యంలో కామయాని ఎక్స్ ప్రెస్, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్ల బోగీలు మాచక్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో వేగంగా స్పందించిన స్థానికులు దాదాపు 300 మంది ప్రయాణికులను కాపాడారు. ఇక ప్రమాదానికి సంబంధించి హర్దా రైల్వే స్టేషన్ తో పాటు భోపాల్, ఇటార్సీ ల్లోనూ రైల్వే శాఖ హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. హర్దా హెల్ప్ లైన్ నెంబరు: 09752460088, భోపాల్ హెల్ప్ లైన్ నెంబరు: 07554061609, ఇటార్సీ హెల్ప్ లైన్ నెంబరు:0758422419200. ప్రయాణికుల వివరాల కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని రైల్వే శాఖ పేర్కొంది.

  • Loading...

More Telugu News