: రైలు ప్రమాదంపై మోదీ స్పందన... దుర్ఘటన బాధాకరమని వ్యాఖ్య
మధ్యప్రదేశ్ లోని హర్దా వద్ద నిన్న రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రైలు ప్రమాదం బాధాకరమని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన సంతాప ప్రకటనను విడుదల చేశారు.