: డైరెక్టుగా మోదీతో ఇంటరాక్ట్ కావాలనుందా?...అయితే ఓ పని చేయండి!
ప్రధాని నరేంద్ర మోదీతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ కావాలనుందా? అయితే వెంటనే ఐఫోన్ కొనుక్కోండి. ఐఫోన్ కు, ప్రధానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? ఉంది. సోషల్ మీడియాలో తనదైన శైలిలో దూసుకుపోయే నరేంద్ర మోదీ కేవలం ఐఫోన్ యూజర్ల కోసం ఓ యాప్ రూపొందించారు. 'నరేంద్ర మోదీ మొబైల్ యాప్' పేరిట రూపొందిన ఈ యాప్ ద్వారా ఐఫోన్ వినియోగదారులు నేరుగా ప్రధానితో ఇంటరాక్ట్ కావచ్చని ఆయన తన ట్విట్టర్లో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక యాప్ ఇదేనని, దీని ద్వారా ప్రధానికి సంబంధించిన తాజా సమాచారం, అప్ డేట్స్, నేరుగా మోదీ నుంచి మెయిల్స్, మెసేజెస్ అందుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ యాప్ ను http://nm4.in/nmiosappలింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.