: అమెరికా ఉపగ్రహాలను లాంచ్ చేయనున్న ఇస్రో... ఇదే తొలిసారి!


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. పలు దేశాలకు చెందిన ఉపగ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లిన ఇస్రో తొలిసారిగా అమెరికా శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. 2015-16 మధ్య కాలంలో అమెరికాకు చెందిన 9 నానో-మైక్రో శాటిలైట్లను లాంచ్ చేసేందుకు ఇస్రోకు చెందిన యాంత్రిక్స్ కార్పొరేషన్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇస్రోకు నమ్మదగిన రాకెట్ గా పేరుగాంచిన పీఎస్ఎల్వీ ఈ ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. ఇస్రో ఇప్పటిదాకా 19 దేశాలకు చెందిన 45 శాటిలైట్లను విజయవంతంగా లాంచ్ చేసింది.

  • Loading...

More Telugu News