: గోవధకు వ్యతిరేకంగా ముస్లిం ఎమ్మెల్యే ప్రచారం
దేశంలో పలు రాష్ట్రాల్లో గోవధపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దానిపై ప్రత్యేకించి ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో, ఓ ముస్లిం ఎమ్మెల్యే గోవధను వ్యతిరేకిస్తూ ప్రచారం చేపట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హాజీ జమీరుల్లా ఖాన్ ఆవులను వధించడం తప్పు అంటున్నారు. అందుకోసం ఆయన మతగురువుల, నేతలతో ప్రచారం చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఖాన్ మీడియాతో మాట్లాడుతూ... హిందువులు తమ సోదరులని, వారు గోవులను పూజిస్తారని, అందుకే వారి సెంటిమెంట్లను గౌరవించాలని పేర్కొన్నారు. గోవధ విషయమై తాను ఖురాన్ ప్రవచనకర్తలతో చర్చకు సిద్ధమేనని ఖాన్ స్పష్టం చేశారు. తప్పనిసరిగా గొడ్డు మాంసం తినాలని అందులో ఏమీ చెప్పలేదని అన్నారు.