: మీకోసం కేవలం 15 నిమిషాలు కేటాయించండి!
రోజులో కేవలం 15 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తే ఆయుఃప్రమాణం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 60 ఏళ్లు దాటిన వారైతే తప్పనిసరిగా 15 నిమిషాలు వ్యాయామం కోసం కేటాయించాలని వారు సూచిస్తున్నారు. వయసు మీదపడి ఏ పని లేకుండా ఉండేవారికి ఈ 15 నిమిషాల వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుందని లండన్ కు చెందిన పరిశోధకులు తెలిపారు. ఈ 15 నిమిషాల వ్యాయామం కారణంగా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయని తద్వారా గుండెపోటుతో మరణించే ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యాయామం వయసు మళ్లిన పురుషులతో పోలిస్తే, మహిళలకు ఎంతో మేలు చేస్తుందని వారు తెలిపారు.