: అశ్లీల వెబ్ సైట్ల కట్టడిపై కేంద్రం వెనుకంజ... నిషేధం ఎత్తివేత దిశగా ఆలోచన
అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం విధించడంతో పలువురు ప్రముఖులు ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన కొందరు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై నిరసన గళమెత్తారు. విజ్ఞానం సర్వస్వం అటువంటి వెబ్ సైట్లలోనే ఉందని, అలాంటి వెబ్ సైట్లను నిషేధిస్తే ప్రజల జ్ఞానచక్షువులు తెరుచుకునేది ఎలా? అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. చేతన్ భగత్ వంటి రచయితలు పోర్న్ సైట్లు చూడడమే అసలైన స్వేచ్ఛ అన్నంతగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్ల ఆవేదన చెప్పనలవి కాదు. సెలబ్రిటీల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుంది. దీంతో ఆయా వెబ్ సైట్లపై విధించిన నిషేధం ఎత్తివేసే దిశగా ఆలోచిస్తోంది. ఈ మేరకు టెలికాం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని సమాచారం.