: ఎంసీఏకి థ్యాంక్స్ చెప్పిన షారుఖ్ ఖాన్


ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తన పట్ల కరుణ చూపినందుకు ఎంసీఏకి కృతజ్ఞతలు తెలిపారు. 2012 మే 16న కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా వాంఖెడే స్టేడియంలో భద్రతా సిబ్బందితో గొడవపడడంతో షారుఖ్ పై ఎంసీఏ తీవ్రంగా స్పందించింది. వాంఖెడే స్టేడియంలో ఐదేళ్లపాటు అడుగుపెట్టరాదంటూ షారుఖ్ పై నిషేధం విధించింది. తాజాగా, ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ముంబయి క్రికెట్ వర్గాలు ప్రకటించాయి. దీనిపై కోల్ కతా నైట్ రైడర్స్ సీఈఓ వెంకీ మైసూర్ కూడా స్పందించారు. ఐపీఎల్ తదుపరి సీజన్ లో వాంఖెడేలో షారుఖ్ హంగామా చూడొచ్చని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News