: ఆ పట్టణంలో మొబైల్ ఫోన్లు, వైఫై, మైక్రోవేవ్ ఒవెన్ లు వాడరు


మొబైల్ ఫోన్ ఒక్క క్షణం అందుబాటులో లేకపోయినా... వైఫై నెట్ వర్క్ లో ఓ క్షణం సాంకేతిక లోపం ఏర్పడినా... మనకొచ్చే కోపానికి అంతు ఉండదు. అలాంటిది సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్న ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్ లేని గ్రామం వుండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పరిస్థితుల్లో ఓ పట్టణం మొబైల్ ఫోన్లు, వైఫై, మైక్రోవేవ్ ఒవెన్ లు వినియోగించడం లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉత్తర వర్జీనియాలోని గ్రీన్ బ్యాంక్ అనే 13 వేల చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన చిన్నపట్టణంలో మొబైల్ ఫోన్లు, వైఫై సర్వీసు, మైక్రోవేవ్ ఒవెన్ లపై నిషేధం అమలులో ఉంది. 1950లో రూపుదిద్దుకున్న ఈ పట్టణం యూఎస్ నేషనల్ రేడియో క్వైట్ జోన్ పరిధిలో ఉంది. అక్కడ మొబైల్ ఫోన్లు, వైఫై నెట్ వర్క్, మైక్రోవేవ్ ఒవెన్ లపై నిషేధం ఉంది. ఈ పట్టణంలో నివసించాలంటే ఇవేవీ వినియోగించమని అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ పట్టణంలో నివాసం ఉంటున్నవారంతా అగ్రిమెంట్ లో పేర్కొన్న ప్రకారం ఫోన్, వైఫై, ఒవెన్ లు వినియోగించడం లేదు. అయితే ఇవేవీ వినియోగించకున్నా అక్కడి వారు చాలా సంతోషంగా ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News