: అతను ముంబై ఇండియన్స్ 'బాహుబలి'!


లసిత్ మలింగ ముంబై ఇండియన్స్ 'బాహుబలి' అని సచిన్ టెండూల్కర్ తెలిపాడు. 'ప్రో కబడ్డీ లీగ్' సందర్భంగా హైదరాబాదులోని ఇనార్బిట్ మాల్ లో సందడి చేసిన సచిన్ మాట్లాడుతూ, ముంబై ఇండియన్స్ జట్టు మెంటార్ గా ఉండడం గౌరవమని పేర్కొన్నాడు. జట్టులో ఎంత మంది ఉన్నా మలింగ లాంటి ఆటగాడు చూపే ప్రభావం వేరని చెప్పాడు. మలింగకు మాత్రమే ఆ రకమైన బౌలింగ్ శైలి సొంతమని పేర్కొన్నాడు. ప్రపంచంలో మరే వ్యక్తి ఆ రకమైన విధంగా బంతులు సంధించలేడని సచిన్ కితాబు ఇచ్చాడు. అలాగే మలింగ సంధించే బంతులు కచ్చితత్వంతో ఉంటాయని సచిన్ అన్నాడు. అతనితో కలసి వుండడం ప్రత్యేకమని సచిన్ తెలిపాడు.

  • Loading...

More Telugu News