: వివాదంపై వివరణ ఇచ్చిన పాక్ క్రికెటర్


పాకిస్థాన్ లో రేగిన వివాదాన్ని క్రికెటర్ సర్ఫరాజ్ తన ప్రకటనతో చల్లార్చాడు. శ్రీలంకతో జరిగిన టీట్వంటీ సిరీస్ జట్టులోకి సర్ఫరాజ్ అహ్మద్ ను పీసీబీ ఎంపిక చేయలేదు. వన్డే, టెస్టు సిరీస్ లో రాణించిన వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ ను టీట్వంటీ సిరీస్ కు ఎంపిక చేయకపోవడం పెద్దఎత్తున దుమారం రేపింది. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజీమ్ సేధీని అభిమానులు నిలదీశారు. దీంతో అవాక్కైన పీసీబీ సర్ఫరాజ్ తో వివరణ ఇప్పించింది. ఈ సందర్భంగా సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ, తాను టెస్టు, వన్డే జట్టుకు మాత్రమే ఎంపికయ్యానని తెలిపాడు. టీట్వంటీ జట్టుకు ఎంపిక కాకపోవడంలో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశాడు. టీట్వంటీ జట్టులో స్థానం లేనప్పుడు ఆడే ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపాడు. అయితే తనకు పాక్ జట్టు తరపున ఆడే అవకాశం వస్తే పూర్తిస్థాయి ప్రతిభ ప్రదర్శిస్తానని చెప్పాడు. టీట్వంటీ సిరీస్ గెలిచాం అది చాలు... దీనిపై రాద్ధాంతం అవసరం లేదని అతను స్పష్టం చేశాడు. తాజా ప్రదర్శన కారణంగా పాక్ ర్యాంకింగ్ కూడా పెరిగిందని సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు.

  • Loading...

More Telugu News