: హైదరాబాదులో స్పోర్ట్స్ పార్క్ ను ప్రారంభించిన సచిన్
బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ విచ్చేశారు. గచ్చిబౌలి ఇనార్బిట్ మాల్ లో నెలకొల్పిన స్పోర్ట్స్ పార్క్ ను సచిన్ ప్రారంభించారు. మంగళవారం రాత్రి నగరంలో జరిగే ప్రొ-కబడ్డీ లీగ్ మ్యాచ్ (తెలుగు టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ పింక్ పాంథర్స్) ను సచిన్ వీక్షించే అవకాశాలున్నాయి. కాగా, ఈ ఉదయం ముంబయి నుంచి హైదరాబాద్ చేరుకున్న సచిన్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. క్రికెట్ లెజెండ్ ను చూసేందుకు ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో, విమానాశ్రయం క్రికెట్ అభిమానులతో కిటకిటలాడింది.