: ఉద్యోగులపై దాడులు కొత్తేమీ కాదు: అశోక్ బాబు
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు కొత్తేమి కాదని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఉద్యోగులపై దాడులు జరిగాయని చెప్పారు. కార్యాలయాల తరలింపు కమిటీలో ఉద్యోగులకు ప్రాతినిధ్యం ఉండాలని, ఉద్యోగుల అభిప్రాయం తీసుకున్న తరువాతే తరలింపు జరగాలని అశోక్ బాబు స్పష్టం చేశారు. అయితే ఆగస్టులో బదిలీల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడతారని తెలిపారు.