: వరుసగా రెండో రోజూ పడిపోయిన బంగారం ధర


బంగారం ధరల పెరుగుదల ఒక్కరోజుకే పరిమితమైంది. రెండు రోజుల క్రితం స్వల్పంగా పెరిగిన పుత్తడి ధర, ఆపై నిన్న, ఇవాళ తగ్గింది. సోమవారం నాటి బులియన్ సెషన్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 100 తగ్గి రూ. 25,130కి చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర రూ. 1083.75 డాలర్లకు చేరింది. ఇదిలావుండగా, ఈ సెషన్లో వెండి ధర కిలోకు రూ. 450 తగ్గి రూ. 33,750కి చేరింది. ఆభరణాల తయారీదారులు, స్టాకిస్టుల నుంచి కొనుగోలు మద్దతు లేకపోవడంతోనే బులియన్ లావాదేవీలు మందగించాయని నిపుణులు వ్యాఖ్యానించారు. డాలర్ తో రూపాయి మారకపు విలువ బలపడటం కూడా మార్కెట్ పై ప్రభావం చూపిందని వివరించారు.

  • Loading...

More Telugu News