: యువ హీరోపై కత్రినాకైఫ్ కి కోపమొచ్చింది!


బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినాకైఫ్ కి సహనటుడిపై కోపమొచ్చింది. బాలీవుడ్ లో ఎటువంటి బ్యాకప్ లేకుండా పైకి వచ్చాడని పేరుతెచ్చుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలతో కత్రినా మండిపడుతోందని బాలీవుడ్ భోగట్టా. అక్షయ్ కుమార్ తో సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటించిన సినిమా 'బ్రదర్స్' ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా 'కత్రినాతో సినిమా చేస్తున్నారు కదా, అనుభవం ఎలా ఉంది?' అంటూ ఓ విలేకరి ప్రశ్నించాడు. దీనికి సిద్ధార్థ్ సమాధానమిస్తూ, కాలేజ్ లో ఉండగా కత్రినా సినిమాలు చూసేవాడినని, అయితే స్క్రీన్ పై ఆమెకు జూనియర్ లా మాత్రం కనిపించనని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రసారం కావడంతో నొచ్చుకున్న కత్రినాకైఫ్ సిద్ధార్థ్ పై గుర్రుగా ఉందట!

  • Loading...

More Telugu News