: మూడు నెలల్లో రూ.22 కోట్లు ఖర్చు చేసిన ఆప్... కోర్టులో కాంగ్రెస్ పిటిషన్
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రచార ప్రకటనల కోసమే రూ.22 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడైంది. అది కూడా మూడు నెలల వ్యవధిలో పత్రికలు, టీవీలకు ఇచ్చిన ప్రకటనల కోసం అంత మొత్తం ఖర్చు పెట్టిందని తెలిసింది. దాంతో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఈ విషయంపై ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో తెలిపిన మాకెన్, ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బును ప్రభుత్వం ప్రకటనల కోసం వాడుకుంటోందని, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు.