: యుక్తవయస్కులా?...'మందు' మానేయాలనుకుంటున్నారా?...పరిష్కారం ఇదిగో!


మీరు యుక్తవయస్కులా? మందు కొట్టే అలవాటుందా? మరి, మానేయాలనుకుంటున్నారా? మీ సమస్యకు అమెరికాలోని మిస్సోరీ యూనివర్సిటీ పరిశోధకులు చక్కని పరిష్కారం చూపిస్తున్నారు. మద్యం జోలికి వెళ్లకూడదనుకుంటే వెంటనే నచ్చిన యువతిని వివాహం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. మద్యం తాగే దురలవాటును మ్యారేజీ మాన్పించగలదని వారు భరోసా ఇస్తున్నారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్యనున్న పలువురిపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైందని వారు స్పష్టం చేశారు. వివాహానికి ముందు మద్యం అలవాటున్న వారిలో 50 శాతం మంది వివాహం తరువాత మద్యం మానేసినట్టు గుర్తించారు. వైవాహిక జీవితం కారణంగా మందుబాబులు మద్యపానం అలవాటును గణనీయంగా తగ్గించుకున్నారని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News