: వీడియో పోస్ట్ చేయ్... చాన్స్ కొట్టేయ్!: పాక్ క్రికెట్ బోర్డు కొత్త ఐడియా


పాకిస్థాన్ క్రికెట్ వివాదాలమయం అయినా, దేశంలో ఎన్నడూ ప్రతిభావంతులకు కొదవలేదు. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు కూడా బోర్డు రాజకీయాలతో ప్రభావితమవుతుంటారు. ఇక, జగడాలతో కాలం వెళ్లబుచ్చడానికే తామున్నది అన్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), రాష్ట్రాల క్రికెట్ సంఘాలు వ్యవహరిస్తుంటాయి. దీంతో, ఆటగాళ్లలో క్రమశిక్షణలేమి ప్రతి స్థాయిలోనూ కనిపిస్తుంది. ఆటగాళ్లే కాదు బోర్డు అధికారులూ అంతే. జట్టు ఎంపిక సందర్భంగా అందుకు వారు చెప్పే కారణాలు సహేతుకంగా ఉండవు. సంక్షిప్తంగా ఇదీ... పాకిస్థాన్ లో క్రికెట్ అవ్యవస్థ! ఇప్పుడదే పీసీబీ ఓ సరికొత్త ఐడియాతో ముందుకువచ్చింది. దేశంలోని మట్టిలో మాణిక్యాలను గుర్తించేందుకు ఓ వినూత్న కార్యాచరణకు రూపుదిద్దింది. తాజా ప్రణాళిక ప్రకారం... త్వరలోనే ఓ ప్రత్యేక వెబ్ సైట్ సిద్ధం చేస్తారు. దేశంలో ఎవరైనాగానీ, తమలో క్రికెట్ సత్తా ఉందని భావిస్తే, తమ బ్యాటింగ్, బౌలింగ్ లను రికార్డు చేసి, వ్యక్తిగత వివరాలు పొందుపరిచి, ఆ వీడియోను సదరు వెబ్ సైట్లో పోస్టు చేయాలి. ఆ వీడియోలను నేషనల్ క్రికెట్ అకాడమీ కోచ్ లు పరిశీలించి, భవిష్యత్తులో ఎదుగుతారని భావించిన ఆటగాళ్లకు అకాడమీలో మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. చాలామంది ప్రతిభావంతులకు అవకాశాలు దక్కడంలేదన్న ఆరోపణల నేపథ్యంలో, పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తాజా వెబ్ సైట్ ఐడియాను ప్రతిపాదించారు.

  • Loading...

More Telugu News