: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: సోనియా
కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సోమవారం లోక్ సభ నుంచి సస్పెండ్ చేయడంపై సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతికమంది కాంగ్రెస్ ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మోదీ అండ్ కోను దుయ్యబట్టారు. తన క్యాబినెట్లోని విదేశాంగ మంత్రి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన నిర్వాకాలతో ఆయనకు నోరు పెగులుతున్నట్టు లేదని మండిపడ్డారు. అంతకుముందు, అవినీతిపై నోరు మెదపకపోవడం అంటే ప్రజలికిచ్చిన హామీలను తుంగలో తొక్కడమేనని విమర్శించారు. అవసరం కోసం ఎన్నో హామీలు గుప్పించారని... ఇప్పుడు వాటిని అమలు పరచడంలో మొత్తానికి చేతులెత్తేసినట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు. జవాబుదారీతనం, పారదర్శకత, సమగ్రత అంటూ వీలు చిక్కితే చాలు... నైతిక విలువల పట్ల ఊదరగొట్టారని తూర్పారబట్టారు.